ఎగ్జామ్ టెండర్ల వివరాలు వెల్లడించాల్సిందే.. సీబీఎస్‌‌‌‌ఈకి సీఐసీ ఆదేశాలు జారీ

ఎగ్జామ్ టెండర్ల వివరాలు వెల్లడించాల్సిందే.. సీబీఎస్‌‌‌‌ఈకి సీఐసీ ఆదేశాలు జారీ

న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల నిర్వహణ వ్యయం, జవాబు పత్రాల కొనుగోలు టెండర్ వివరాలను వెల్లడించాలని సెంట్రల్ బోర్డ్​ ఆఫ్ ​సెకండరీ ఎడ్యుకేషన్​(సీబీఎస్​ఈ)ను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. ఆర్టీఐ పరిధిలోకి వచ్చే సమాచారాన్ని పాయింట్ల వారీగా దరఖాస్తుదారుడికి అందించాలని స్పష్టం చేసింది. 

సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తూ గతంలో సీబీఎస్‌‌‌‌ఈ తీసుకున్న నిర్ణయాన్ని కమిషన్​​పక్కనబెట్టింది.2023–-24, 2024–-25 విద్యా సంవత్సరాల్లో వాడిన జవాబు పత్రాల నాణ్యత, పరిమాణం, ధర, మొత్తం వ్యయం, జీఎస్టీ చెల్లింపులు, టెండర్ ప్రక్రియ వివరాలు కోరుతూ ఓ వ్యక్తి ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నారు.

 దీనికి సీబీఎస్‌‌‌‌ఈ స్పందిస్తూ.. పేపర్ సైజు, పేజీల సంఖ్య వంటి బేసిక్ ​వివరాలు మాత్రమే వెల్లడించింది. మిగతా వివరాలను ‘రహస్య’, ‘సున్నితమైన’ అంశాలుగా పేర్కొంటూ వెల్లడించేందుకు  నిరాకరించింది. పరీక్షల ఫీజుల వ్యయ డేటాను విద్యా సంవత్సరాల వారీగా కాకుండా ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన నిర్వహిస్తున్నందున ఆ వివరాలు ఇవ్వలేమని బోర్డు తెలిపింది.