చంద్రబాబు మీడియాతో ఎలా మాట్లాడతారు.. కోర్టులో సీఐడీ

చంద్రబాబు మీడియాతో ఎలా మాట్లాడతారు.. కోర్టులో సీఐడీ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ లో మరిన్ని షరతులు విధించాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు మీడియాతో మాట్లాడారని వీడియో క్లిప్పింగ్స్ ను సీఐడీ తరుపు న్యాయవాదుల పెన్ డ్రైవ్ లో కోర్టుకు అందజేశారు. కోర్టు ఆర్డర్ ను పాటించకుండా చంద్రబాబు మీడియాతో మాట్లాడారని..13 గంటల పాటు రాజమండ్రి జైలు నుంచి ర్యాలీగా చంద్రబాబు విజయవాడ వచ్చారని న్యాయస్థానానికి తెలిపారు.జైలు విడుదలైన తర్వాత ర్యాలీలు నిర్వహించవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నాయని సీఐడీ తరుపు న్యాయవాది కోర్టుకు చెప్పారు.

కోర్టు ఆర్డర్ ఎక్కడా చంద్రబాబు అతిక్రమించ లేదని... చంద్రబాబు మాట్లాడటం అనేది ఆయన ప్రాథమిక హక్కులలో భాగమే తప్ప.. అతిక్రమన కాదని చంద్రబాబు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు .జైలు శిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం గతంలో కోర్టులు కల్పించాయని చెప్పారు. సీఐడీ చెబుతున్న షరతులు ఆయన హక్కులు హరించే విధంగా ఉన్నాయని కోర్టుకు వివరించారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న  హైకోర్టు.. తీర్పును శుక్రవారానికి(నవంబర్ 3) రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.