ఏపీ మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ లోని కొల్లా లాగ్జరియాలో గల నివాసాల్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే నారాయణ ఇంట్లో పలుసార్లు సోదాలు చేసిన సీఐడీ ..ఇపుడు ఆయన కుమార్తె ఇంట్లో సోదాలు చేస్తుంది. అయితే సీఐడీ ఏ విషయంలో సోదాలు చేస్తుందనేది సమాచారం లేదు.
