తమిళనాట ఎప్పుడూ లేనంత హాట్ టాపిక్ ఇప్పుడు నడుస్తోంది. ఒకవైపు తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో గెలిచి, పొలిటికల్ ఎంట్రీతో దుమ్మురేపిన దళపతి విజయ్... మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ ముసురుకున్న వివాదాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విజయ్, త్రిష కృష్ణన్ మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించిన రూమర్స్ నెట్టింట రోజుకో మలుపు తిరుగుతున్నాయి. లేటెస్ట్ గా సింగర్ సుచిత్ర చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ మంటకు మరింత ఆజ్యం పోశాయి. నటి త్రిషను టార్గెట్ చేస్తూ సుచిత్ర చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
త్రిష ఒక పారసైట్!
ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో సుచిత్ర మాట్లాడుతూ... తనకు విజయ్ అంటే చాలా ఇష్టమని, కానీ త్రిష అంటే అస్సలు పడదని కుండబద్దలు కొట్టారు. త్రిష పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆమెను ఒక 'పారసైట్' (పరాన్నజీవి) అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. విజయ్ తన తల్లిదండ్రులకు, భార్యకు దూరమై ఒంటరిగా మారాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో సక్సెస్‌ఫుల్ వ్యక్తుల జీవితాల్లోకి పరాన్నజీవిలు ప్రవేశిస్తాయి. ఎన్నికల విజయం తర్వాత విజయ్‌కు ఉన్న క్రేజ్‌ను వాడుకోవడానికే త్రిష ఆయన పక్కన చేరుతోంది అని సుచిత్ర వ్యాఖ్యానించారు.
27 ఏళ్ల బంధానికి బీటలు..
విజయ్, ఆయన భార్య సంగీత దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత ఇటీవల విడాకులకు దరఖాస్తు చేసుకోవడం కోలీవుడ్‌ను కుదిపేసింది. సంగీత దాఖలు చేసిన పిటిషన్‌లో... విజయ్‌కు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని, అది తెలిసినప్పటి నుంచే తమ మధ్య దూరం పెరిగిందని పేర్కొన్నారు. ఆ నటి మరెవరో కాదు, త్రిషేనంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కోడై కూస్తున్నారు.
గిల్లి నుండి లియో వరకు...
2004లో వచ్చిన 'గిల్లి' సినిమాతో విజయ్-త్రిష జోడీ ఐకానిక్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'తిరుపాచ్చి', 'ఆతి', 'కురువి' చిత్రాలతో వీరి బాండింగ్ మరింత బలపడింది. 2008 తర్వాత విజయ్ కుటుంబ సభ్యుల ఒత్తిడితో వీరిద్దరూ కలిసి నటించడం ఆపేశారనే ప్రచారం జరిగింది. కానీ, దాదాపు 15 ఏళ్ల తర్వాత 2023లో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన 'లియో' సినిమాతో ఈ జంట మళ్లీ వెండితెరపై మెరిసింది.
►ALSO READ | NBK Koratala Title: బాలకృష్ణ-కొరటాల మూవీకి టైటిల్ ఫిక్స్.. మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుధ్!
ప్రస్తుతం తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ .. సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు తమిళనాడు రాజకీయ నేతలు సైతం విజయ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో సుచిత్ర చేసిన వ్యాఖ్యలపై త్రిష అభిమానులు భగ్గుమంటుండగా... దళపతి వ్యక్తిగత జీవితం ఏ మలుపు తిరుగుతుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి..
