నందమూరి బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘దేవర’ సినిమా తెరకెక్కించిన యువ సుధ ఆర్ట్స్ బ్యానర్పై బాలకృష్ణ, కొరటాల సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని ఇటీవలే నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. శక్తికి ఒక లక్ష్యం తోడైతే.. జనసమూహం ఒక ఉద్యమంగా మారుతుంది అనే పవర్ఫుల్ కొటేషన్తో పోస్టర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచింది.
సోషల్ మెసేజ్తో భారీ మాస్ యాక్షన్..
డైరెక్టర్ కొరటాల శివ ఫస్ట్ టైం బాలకృష్ణతో సినిమా చేస్తుండటంతో భారీ ఆసక్తి పెరిగింది. ఏ మాత్రం తన మార్క్కి తగ్గకుండా సోషల్ మెసేజ్తో కూడిన మాస్ యాక్షన్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథ బాలయ్యకు పిచ్చపిచ్చగా నచ్చేసిందని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే, బాలయ్య-కొరటాల రేంజ్ సినిమా అంటే.. టైటిల్ ఎంత పవర్ ఫుల్గా ఉండాలో తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే కొరటాల ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ను రిజిస్టర్ చేయినంచినట్లుగా టాక్ వినిపిస్తోంది.
NBK 112 లేటెస్ట్ అప్డేట్,
ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకు ‘కార్పెంటర్’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు టాక్. అదేంటీ కార్పెంటర్ అంటే వడ్రంగి కదా.. ‘ఈ సినిమాలో బాలయ్య కిటికీలు, తలపులు చేస్తాడా?’ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కొరటాల సబ్జెక్టుకు తగ్గట్టుగానే ‘కార్పెంటర్’ అని టైటిల్ ఫిక్స్ చేసాడట. సమాజంలో కుళ్లిపోయిన వ్యక్తులకు, వ్యవస్థలకు మరమ్మత్తు చేసే బాధ్యతను బాలయ్యకు అప్పగించాడట కొరటాల. అందుకే, తన నైజాంతో, తన ఉక్కుపిడికిలి సంకల్పంతో వ్యవస్థను క్లీన్ చేసేలా బాలయ్య ఆర్క్ ఉంటుందని టాక్.
టైటిల్ వెనుక అసలు కథ ఇదే..
కొరటాల గతంలో ‘జనతా గ్యారేజ్’ అని టైటిల్ పెట్టి: న్యాయం కోరుకునే నిరుపేదలు జనతా గ్యారేజ్ వైపు చూసేలా చేశాడు. అలాగే, ప్రకృతికి అన్యాయం చేసే వ్యక్తులను వెంటాడే వ్యక్తిగా ఎన్టీఆర్ ని చూపించి సక్సెస్ కొట్టాడు. అనంతరం జనతా గ్యారేజ్ కి వచ్చే సమస్యలపై పోరాడే వ్యక్తిగా ఎన్టీఆర్ ని మలిచిన విధానం ఆకట్టుకుంది.
►ALSO READ | OTT Movie Review: క్షుద్రపూజలపై ఉత్కంఠరేపే కథనం.. ఓటీటీలో మస్ట్ వాచ్ హారర్ మూవీ!
ఈ క్రమంలోనే ఇపుడు కొరటాల ‘కార్పెంటర్’ అనే టైటిల్ పెట్టినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే సినిమాకు సెన్షనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ని సైతం రంగంలోకి దింపినట్లు సమాచారం. ఇక బాలయ్యకు అనిరుధ్ ఇచ్చే ఎలివేషన్స్ ఎలా ఉంటాయో ఊహించుకోండి. ఈ తాజా అప్డేట్స్ కనుక నిజమైతే బాలయ్య ఫ్యాన్స్కి సాలిడ్ హిట్ పడ్డట్టే అని చెప్పుకోవాలి.
The Stars Align ✨
— Yuvasudha Arts (@YuvasudhaArts) May 1, 2026
A Festival Awaits 💥💥#NBKxKoratalaSiva ❤🔥#NBK112 pic.twitter.com/PiBfFRWSeV
