హైదరాబాద్, వెలుగు: సెమీకండక్టర్లు, ఏఐ, డీప్ టెక్నాలజీ, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లలో తైవాన్ సాధించిన విజయాలను, ఆవిష్కరణలను అధ్యయనం చేయడానికి, అంతర్జాతీయ భాగస్వామ్యాల కోసం ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఇన్నోవేటర్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్స్ (ఐసీఐఈ) ‘ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ తైవాన్’ నిర్వహించనుంది.
దీని గురించి తైవాన్ ప్రభుత్వ సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ (ఐఐఐ), నేషనల్ యాంగ్ మింగ్ చియావో టుంగ్ యూనివర్సిటీ (ఎన్‌వైసీయూ) ప్రతినిధులతో ఐసీఐఈ కన్వీనర్ ముక్తాల సందీప్ చర్చించారు. వచ్చే నెల 29 నుంచి ఆగస్టు 2 వరకు తైవాన్‌లో పర్యటన ఉంటుంది. సెమీకండక్టర్లు, ఏఐలు, స్టార్టప్‌లు, పరిశోధన, ఆవిష్కరణల రంగాలపై దృష్టి పెడతామని ఆయన చెప్పారు. తైవాన్ టెక్నాలజీను అధ్యయనం చేయడానికి ఇది మంచి వేదికని అన్నారు. ఆసక్తి ఉన్న వారు bit.ly/explore2expand ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
