న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ సిప్లాకు కిందటేడాది డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ3) లో రూ.676 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. 2024 డిసెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.1,571 కోట్ల ప్రాఫిట్‌తో పోలిస్తే ఇది 57శాతం తక్కువ. కంపెనీ మొత్తం ఆదాయం రూ.7,074 కోట్లు వద్ద స్థిరంగా ఉంది.
అమెరికా మార్కెట్‌లో విక్రయాలు క్యూ3లో రూ.1,906 కోట్ల నుంచి 22శాతం తగ్గి రూ.1,485 కోట్లకు చేరాయి. యూఎస్ ఎఫ్‌డీఏ ఆడిట్‌తో అమెరికాలో లాన్రియోటైడ్ సరఫరా సమస్యలు ఏర్పడ్డాయని సిప్లా ఎండీ అచిన్ గుప్తా తెలిపారు. ఈ మందును టూమర్స్ చికిత్సలో వాడతారు. భారత్‌లో వ్యాపారం 10శాతం పెరిగి రూ.3,457 కోట్లకు చేరిందని సిప్లా
ప్రకటించింది.
