పౌరులకు హక్కులపై అవగాహన కల్పించాలి: సీజేఐ జస్టిస్ గవాయ్

పౌరులకు హక్కులపై అవగాహన కల్పించాలి: సీజేఐ జస్టిస్ గవాయ్

శ్రీనగర్: దేశంలోని పౌరులందరికీ వాళ్లకు ఉన్న హక్కులపై అవగాహన కల్పించాలని, లేదంటే వాటి వల్ల ప్రయోజనమే ఉండదని సుప్రీంకోర్టు చీఫ్‌‌ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. ఆదివారం జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని శ్రీనగర్‌‌‌‌లో నిర్వహించిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) నార్త్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్‌‌లో జస్టిస్ గవాయ్ మాట్లాడారు. దేశంలోని పౌరులందరికీ న్యాయం అందేలా చూడాల్సిన బాధ్యత జడ్జీలు, లాయర్లపై ఉన్నదని అన్నారు. 

ఈ దిశలో నల్సా ఇప్పటికే కృషి చేస్తోందన్నారు. ‘‘గత 35 ఏండ్లలో కాశ్మీర్‌‌‌‌లో చాలా మార్పులు వచ్చాయి. కొన్ని తప్పిదాలు జరిగాయి. వాటిని సరిదిద్దాలి. విభేదాలు లేకుండా అన్ని వర్గాలు కలిసిమెలసి పాత కాశ్మీర్‌‌‌‌ను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం న్యాయవాదులు కృషి చేయాలి. ఈ కార్యక్రమం అందుకు దోహదం చేస్తుంది” అని అన్నారు.


=================================================================