న్యూఢిల్లీ: సిటియస్ ట్రాన్స్‌నెట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ రూ.1,105 కోట్ల ఐపీఓను ప్రకటించింది. ఒక్కో యూనిట్ ధరను రూ.99 నుంచి రూ.100గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ఏప్రిల్ 17న ప్రారంభమై, ఏప్రిల్ 21న ముగుస్తుంది. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను రహదారి ప్రాజెక్టుల కొనుగోలుకు ఉపయోగిస్తారు. ఈ ట్రస్ట్ కు తొమ్మిది రాష్ట్రాల్లో 3,406 లేన్ కిలోమీటర్ల రహదారి ఆస్తులు ఉన్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లలో ఈ యూనిట్లు లిస్ట్ కానున్నాయి.

