బ్యాంకింగ్ రంగంలో బ్లండర్ మిస్టెక్.. రూ. 3,641 కోట్లు ఫార్వార్డ్

బ్యాంకింగ్ రంగంలో బ్లండర్ మిస్టెక్.. రూ. 3,641 కోట్లు ఫార్వార్డ్

బ్యాంకింగ్ రంగంలోనే ఇదో బ్లండర్ మిస్టెక్ అని చెప్పుకోవచ్చు. ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తాన్ని ఖాతాదారుల అకౌంట్లలోకి సిటీబ్యాంక్ ఫార్వార్డ్ చేసింది. అమెరికాలోని రెవ్లాన్ కంపెనీకి సిటీబ్యాంక్ లోన్ ఏజెంట్‌గా వ్యవహరిస్తోంది. ఈ కంపెనీకి కొంతమంది రుణదాతలు ఉన్నారు. వారికి కంపెనీ తరపున 8 మిలియన్ డాలర్లు(రూ. 58 కోట్లు) ఇవ్వాల్సి ఉంది. అయితే సిటీబ్యాంక్ పొరపాటున 900 మిలియన్ డాలర్లు (రూ. 3,641 కోట్లు) ఫార్వార్డ్ చేసింది. ఈ తప్పిదాన్ని బ్యాంక్ సిబ్బంది మరుసటిరోజు గుర్తించి నాలుక కరుచుకున్నారు. వెంటనే సదరు రుణదాతలను సంప్రదించి డబ్బులు వెనకకు ఇవ్వాల్సిందిగా కోరింది. దానికి వారు ససేమీరా అనడంతో.. బ్యాంకు కోర్టును ఆశ్రయించింది.

అయితే న్యూయార్క్ చట్టాలకు కొంత వ్యత్యాసం ఉంటుంది. ఇలా డబ్బులు పొరపాటుగా వేరే వాళ్ల అకౌంట్‌లో పడితే వాటిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంతో న్యూయార్క్ కోర్టు జడ్జీ జెస్సీ.. సిటీబ్యాంక్ వాదనను తోసిపుచ్చింది. రేవ్లాన్ రుణదాతలు ఆ డబ్బులు పూర్తిగా తిరిగి చెల్లించనవసరంలేదని తీర్పు చెప్పింది. మొత్తంలో 400 మిలయన్ డాలర్లు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం సిటీబ్యాంక్ 500 మిలియన్ డాలర్లను నష్టపోతుంది. దాంతో సిటీబ్యాంక్ యాజమాన్యం కోర్టు తీర్పును తప్పుబడుతూ పైకోర్టులో అప్పీలు చేసుకోవాలనే యోచనలో ఉంది.

For More News..

కేసీఆర్ బర్త్‌డే: అమ్మవారికి 2.5 కేజీల బంగారు చీర

బాంబు తయారీ నేర్పిస్తుండగా పేలుడు.. 30 మంది మృతి

అపార్ట్‌మెంట్‌లో మ్యారేజ్ యానివర్సరీ.. 103 మందికి కరోనా