నగరంలో త్వరలో అన్నీ ఎలక్ట్రిక్​ బస్సులే: సీఎం రేవంత్​

నగరంలో త్వరలో అన్నీ ఎలక్ట్రిక్​ బస్సులే: సీఎం రేవంత్​
  • హైదరాబాద్​ను పొల్యూషన్ ఫ్రీ సిటీగా మారుస్తం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో త్వరలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులనే వినియోగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు నగరంలో తిరుగుతున్న డీజిల్ బస్సులను జిల్లాలకు తరలిస్తామని చెప్పారు. మంగళవారం తన ఇంట్లో సీఎం రేవంత్​ మీడియాతో చిట్ చాట్ చేశారు.  హైదరాబాద్​ మహానగరాన్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 

రూ. లక్షన్నర కోట్లతో మూసీ రివర్ ప్రక్షాళన ఏమిటని ఎక్స్​ వేదికగా కేటీఆర్ అడిగిన ప్రశ్నపై రేవంత్​ స్పందించారు.  ‘‘కేటీఆర్ ఓ పిచ్చోడు.. పదేండ్లు మంత్రిగా వెలగబెట్టానని గొప్పగా చెప్తాడు.. కానీ అమెరికాలో బాత్ రూం లు కడిగిన తెలివి తప్ప మరేమి లేదు” అని మండిపడ్డారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించిన నిర్ణయాలు హైకమాండ్ చేతిలో ఉన్నాయని చెప్పారు. 

హైదరాబాద్​ను ప్రణాళికాబద్ధంగా డెవలప్​ చేస్తం

హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని సీఎం రేవంత్​ చెప్పారు.  కేంద్ర బడ్జెట్ లో  దక్షిణాది ప్రాంతాలకు జరిగిన అన్యాయంపై త్వరలో అన్ని రాష్ట్రాల సీఎంల సమావేశాలు ఉండే అవకాశం ఉన్నదని చెప్పారు. రాహుల్ ప్రతిపక్ష నేతగా ఉన్నందున దీనిపై పార్లమెంట్ లో ప్రస్తావించే చాన్స్​ ఉంటుందన్నారు.