హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. హైదరాబాద్ CP సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్ ఏర్పాటు చేయాలని డీజీపీ నిర్ణయించారు. సిట్లో 9 మంది అధికారులు ఉన్నారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్, రామగుండం సీపీ ఆంబరి కిషోర్ జా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితి రాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డితో పాటు రవీందర్, వెంకట గిరి, కేఎస్ రావు, శ్రీధర్, నాగేందర్ రావు ఈ సిట్లో సభ్యులుగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత లోతైన ఇన్వెస్టిగేషన్ జరిపేందుకు డీజీపీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
* ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ పోలీసులు దూకుడు
* ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు
* హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్..
* మొత్తం 9 మంది అధికారులతో SIT ఏర్పాటు
* SITలో 5 మంది ఐపీఎస్ అధికారులు సభ్యులు
* పంజాగుట్ట పీఎస్ క్రైం నంబర్ 243/2024 కేసుపై విచారణ చేయనున్న ప్రత్యేక సిట్
* ఫోన్ ట్యాప్పై ఐటీ యాక్ట్, పీడీపీపీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద గతంలో కేసు
* త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశాలు
* అత్యున్నత వృత్తి నైపుణ్యాలతో విచారణ జరపాలని ఆదేశాలు
* శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో డీజీపీ ఉత్తర్వులు
