హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలను TGPSC విడుదల చేసింది. గ్రూప్ 3 పరీక్ష మొత్తం 1388 పోస్టుల భర్తీ కోసం నిర్వహించగా.. 1370 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు TGPSC ప్రకటించింది. 2025 మార్చి 14న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (GRL) ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్లు TGPSC తెలిపింది.
ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితా TGPSC అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. 2024లో నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 5 లక్షల 36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది మాత్రమే పరీక్షలకు హాజరు కావడం గమనార్హం.
జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, ఎల్‌డి స్టెనో తదితర పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించిన పరీక్షకు సుమారు 2.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులు ఫలితాలను TGPSC అధికారిక వెబ్సైట్ https://www.tgpsc.gov.in లో చూసుకోవచ్చు.
గురువారం విడుదల చేసిన ఈ ఫలితాలు కోర్టులలో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ల తుది తీర్పునకు లోబడి ప్రకటించినట్లు TGPSC స్పష్టం చేయడం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారం అందించినట్లు తేలితే.. వారి ఎంపికను ఏ దశలోనైనా రద్దు చేసే అధికారం TGPSCకి ఉందని TGPSC సెక్రటరీ డాక్టర్ ప్రియాంక ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
