- 10,223 నాన్ షెడ్యూల్ జీపీలకు గాను 5,123 చోట్ల విజయం
- 2,186 రిజర్వుడ్ సహా 2,937 జనరల్ స్థానాలూ కైవసం
- అత్యధికంగా నల్గొండ జిల్లాలో 524 సీట్లు
- వికారాబాద్‌లో 364, రంగారెడ్డిలో 329, భువనగిరిలో 304
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటారు. తమకు రిజర్వ్ చేసిన పంచాయతీలను మించి, జనరల్ స్థానాలను కైవసం చేసుకున్నారు. 2,186 బీసీ రిజర్వుడ్ స్థానాలతో పాటు జనరల్ కేటగిరిలోని 2,937 స్థానాల్లోనూ విజయబావుటా ఎగురవేశారు. మొత్తం 12,760 పంచాయతీల్లో 2,537 ఏజెన్సీ గ్రామాలు పోగా.. మిగిలిన 10,223 నాన్‌షెడ్యూల్ జీపీల్లో ఏకంగా 5,123 చోట్ల (50 శాతం) బీసీ బిడ్డలు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా సగం స్థానాల్లో సర్పంచ్‌లుగా బీసీలు గెలుపొందారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే అత్యధిక బీసీ సర్పంచులు గెలిచిన జిల్లాగా నల్గొండ టాప్‌లో నిలిచింది. కానీ మొత్తం సీట్లతో పోల్చినప్పుడు సిద్దిపేట, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో బీసీల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నది.
ఆ మండలంలో ఓసీలకు ఒక్క సీటూ రాలేదు..
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో బీసీలు పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచారు. ఈ మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా.. 7 జనరల్, 4 బీసీ, 3 ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 7 జనరల్స్థానాల్లోనూ బీసీలే విజయం సాధించారు. రిజర్వ్‌డ్ స్థానాలతో కలుపుకుని మొత్తం 11 మంది బీసీ సర్పంచులు ఇక్కడ గెలిచారు. ఈ మండలంలో ఓసీలకు ఒక్క సర్పంచ్పదవీ దక్కలేదు.
ఆ మండలంలో ఓసీలకు ఒక్క సీటూ రాలేదు..
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో బీసీలు పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచారు. ఈ మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా.. 7 జనరల్, 4 బీసీ, 3 ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 7 జనరల్ స్థానాల్లోనూ బీసీలే విజయం సాధించారు. రిజర్వ్‌డ్ స్థానాలతో కలుపుకుని మొత్తం 11 మంది బీసీ సర్పంచులు ఇక్కడ గెలిచారు. ఈ మండలంలో ఓసీలకు ఒక్క సర్పంచ్పదవీ దక్కలేదు.
జిల్లాల వారీగా గెలిచిన బీసీ స్థానాలు
జిల్లా రిజర్వేషన్ కోటా జనరల్ మొత్తం స్థానాలు
మెదక్ 108 15 123
సంగారెడ్డి 117 19 136
నిజామాబాద్ 125 56 181
పెద్దపల్లి 69 41 110
ఖమ్మం 54 36 90
నారాయణపేట 72 51 123
వనపర్తి 62 50 112
మహబూబాబాద్ 86 70 156
రాజన్న సిరిసిల్ల 66 57 123
కామారెడ్డి 123 112 235
జయశంకర్ భూపాలపల్లి 46 44 90
సిద్దిపేట 129 129 258
కరీంనగర్ 84 87 171
జోగులాంబ గద్వాల 70 79 149
జనగామ 45 57 102
జగిత్యాల 98 126 224
హన్మకొండ 45 58 103
నిర్మల్ 72 105 177
మహబూబ్‌నగర్ 19 30 49
నాగర్‌కర్నూల్ 61 100 161
యాదాద్రి భువనగిరి 105 199 304
వికారాబాద్ 107 257 364
ఆదిలాబాద్ 23 57 80
కొమరంభీం ఆసిఫాబాద్ 20 50 70
వరంగల్ 47 118 165
మంచిర్యాల 31 78 109
రంగారెడ్డి 91 238 329
నల్లగొండ 140 384 524
ములుగు 5 15 20
సూర్యాపేట 66 218 284
భద్రాద్రి కొత్తగూడెం 0 1 1
మొత్తం 2,186 2,937 5,123
