బుద్ధి జ్ణానం ఉందారా నీకు : మెట్రో స్టేషన్ ప్లాట్ ఫాంపై ఈ పనులేంట్రా..

 బుద్ధి జ్ణానం ఉందారా నీకు : మెట్రో స్టేషన్ ప్లాట్ ఫాంపై ఈ పనులేంట్రా..

బుద్ది, జ్ణానం, సిగ్గు, లజ్జా ఉన్నాయా వీడికి.. కనీసంలో కనీసం కామన్ సెన్స్ అయినా ఉందా అంటే.. వీడు చేసిన పనికి అలాంటి ఏమీ లేదని స్పష్టం అవుతుంది. మెట్రో స్టేషన్ ఫ్లాట్ ఫాంపైనే చుచ్చూ పోవటం చూస్తుంటే.. మినిమం కామన్ సెన్స్ అనేది వీడికి లేదని తేలిపోయింది. ఈ ఫొటోలు చూస్తే ఎవడ్రా వీడు.. ఇంత గలీజుగా ఉన్నాడు అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకీ వీడు చేసిన పని ఏంటీ.. ఆ వివరాలు తెలుసుకుందాం...

ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫామ్‌పై ఒక వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తూ కెమెరాలో చిక్కిన  ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తు... ఇలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటన రోజూ వేల మంది ప్రయాణించే మెట్రో స్టేషన్‌లో పౌర బాధ్యత ఎంతగా లోపించిందో తెలియజేస్తుంది. పబ్లిక్ ప్రదేశంలో ఇలా ప్రవర్తించడం ఎంత బాధ్యతారహితమో ఈ వీడియో స్పష్టంగా చూపిస్తోంది.

వైరల్ అయిన వీడియోలో మధ్య వయస్కుడైన ఒక వ్యక్తి గ్లాస్ డోర్  ఉన్న కారిడార్ దగ్గర నిలబడి బహిరంగంగా మూత్ర విసర్జన  చేస్తుండగా అక్కడ ఉన్న మరో ప్రయాణికుడు అతడిని వీడియో తీస్తుంటాడు. ఎవరో తనని వీడియో తిస్తున్నారని గమనించిన వెంటనే, ఆ వ్యక్తి  అక్కడి నుంచి పరారయ్యాడు.

నెటిజన్ల స్పందనలు:

ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి  “ఢిల్లీలో చాలామందికి  సెన్స్ అసలు లేదు. మెట్రో ప్రాంగణాల్లో బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం, అది కూడా  దేశ రాజధానిలో ఇలా జరగడం చాలా బాధాకరం.” అని అనగా.... మరో యూజర్  “అలంటి వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయాలి. శిక్ష పడాలి” అని అన్నారు.

►ALSO READ | ఇలా ఉన్నార్రేంట్రా మనుషులు : 16 ఏళ్ల బాలుడిని నగ్నంగా.. తాళ్లతో కట్టేసి ఊరంతా తిప్పారు..!

ఇంకొకరు “కొంతమంది ఢిల్లీ మెట్రోను ఇల్లులా భావిస్తున్నారు. ఏది పడితే అది చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి. ఢిల్లీ మన దేశ రాజధాని, దాన్ని ఇలా నాశనం చేయకూడదు.” అంటూ కామెంట్ చేసారు... 

ఇది ఒక్క సంఘటనే కాదు. గతంలో కూడా ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. కొద్దీరోజుల క్రితం ఎర్రకోట మెట్రో స్టేషన్ బయట బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ప్రజలు పట్టుకున్నారు.  ఆ సమయంలో అక్కడ విదేశీయులు కూడా ఉన్నారు.

ఆ విదేశీయులు కొంతమంది యువ వాలంటీర్లతో కలిసి క్లినింగ్ కార్యక్రమంలో పాల్గొంటుండగా, ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలు పబ్లిక్ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తించాలో అనే విషయంపై మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చూపిస్తున్నాయి.