
ఇంటర్మీడియట్‌లో ఉండే ‘సివిక్స్’ సబ్జెక్ట్ పేరు మారింది. దీన్ని పొలిటికల్ సైన్స్‌గా మార్పు చేస్తూ శనివారం ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. పొలిటికల్ సైన్స్‌కు సంబంధించిన కొత్త పుస్తకాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ శనివారం ఆవిష్కరించారు. ఇంటర్మీడియట్ లెవెల్‌లో HEC గ్రూప్‌లో ‘సి’ని సివిక్స్ సబ్జెక్ట్ గా ఉండేది. అదే డిగ్రీకి వచ్చేసరికి అది పొలిటికల్ సైన్స్‌గా పరిగణించేవారు. ఇప్పుడు ఇదే సివిక్స్ ని ఇంటర్ లో పొలిటికల్ సైన్స్ గా మార్చినట్లు తెలిపింది ఇంటర్ బోర్దు.