
- 8మంది పరిస్థితి విషమం..30మందికి తీవ్రగాయాలు
- తుమ్మలూరుగేటు దగ్గర ప్రమాదం..
- ఎదురెదురుగా ఢీకొన్న కల్వకుర్తి డిపో ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెల్ బస్సు
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం (మే3) రాత్రి మహేశ్వరం మండలం తుమ్మలూరు గేటు దగ్గర ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 38 మంది తీవ్రగాయాలయ్యాయి. వీరితో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది.
నడిరోడ్డుపై ప్రమాదం జరగడంతో శ్రీశైలం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గాయపడిన వారిని అంబెలెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. రెండు బస్సుల్లో దాదాపు 150 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుగా గుర్తించారు. మరొక బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ గుర్తించారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.