ఓలా, ఉబర్, రాపిడో కంపెనీలకు షాక్.. ఇకపై డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చేస్తే కస్టమర్లకు ఫైన్ కట్టాల్సిందే..!

ఓలా, ఉబర్, రాపిడో కంపెనీలకు షాక్.. ఇకపై డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చేస్తే కస్టమర్లకు ఫైన్ కట్టాల్సిందే..!

ముంబై: సొంత వెహికల్ లేని వారు ఓలా, ర్యాపిడో, ఉబెర్ వంటి ప్రైవేట్ ట్రాన్స్‎పోర్టును ఆశ్రయిస్తుంటారు. త్వరగా గమ్యం చేరుకోవడంతో పాటు.. కంఫర్టబుల్ ప్రయాణం చేయొచ్చనే ఉద్దేశంతో చాలా మంది బస్సు, మెట్రో వంటివి కాకుండా వీటిని ఉపయోగిస్తుంటారు. అయితే.. అనివార్య కారణాల వల్ల కొన్నిసార్లు మనం బుక్ చేసుకున్న రైడ్‎ను క్యాన్సిల్ చేస్తే ఆయా సంస్థలు కస్టమర్ల నుంచి ముక్కు పిండి క్యాన్సలేషన్ ఫీజులు వసూల్ చేస్తాయి. ఇదే క్రమంలో కొన్నిసార్లు ఆయా కంపెనీలు, డ్రైవర్లు కూడా ఆర్డర్లను క్యాన్సిల్ చేస్తుంటారు.

 దీనికి మాత్రం ఎలాంటి క్యాన్సలేషన్ ఫీజు ఉండదు. బోనస్‎గా కస్టమర్ల సమయం వృధా అవుతోంది. ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఓలా, ర్యాపిడో, ఉబెర్ వంటి ప్రైవేట్ ట్రాన్స్‎పోర్టు సంస్థలకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. కస్టమర్లు రైడ్ క్యాన్సిల్ చేస్తే వారి వద్ద నుంచి ఎలాగైతే క్యాన్సలేషన్ ఫీజు వసూల్ చేస్తున్నారో.. ఇకపై ఆయా కంపెనీలు లేదా ట్రాన్స్‎పోర్టు సంస్థల డ్రైవర్లు కన్ఫార్మ్ అయినా రైడ్ క్యాన్సిల్ కస్టమర్లకు క్యాన్సలేషన్ ఫీజు చెల్లించాలి.

కస్టమర్ల విలువైన సమయం వృధా చేసినందుకు దానికి తగిన పరిహారం కస్టమర్‎కు చెల్లించాలని రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ వల్ల ఇకపై రైడర్లు ఇష్టారీతిన రైడ్లను క్యాన్సిల్ చేయరని.. తద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం పట్ల ఓలా, ఉబెర్, ర్యాపిడో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల నుంచి క్యాన్సలేషన్ ఫీజులు వసూల్ చేసినప్పుడు.. అదే మాదిరిగా కంపెనీలు కూడా ఫైన్ చెల్లించాలని.. అందరికే ఒకే రూల్ ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.