
ఐపీఎల్ 18లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. శనివారం (మే 3) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో దుమ్మురేపాడు. సొంతగడ్డపై చెన్నై బౌలర్లను ధీటుగా ఎదుర్కొని 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 62 పరుగులు చేశాడు. తద్వారా ఒకే మ్యాచులో నాలుగు వేర్వేరు రికార్డ్‌లు సృష్టించాడు విరాట్ కోహ్లీ.
టీ20 లీగ్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ (ఆర్సీబీ) తరుఫున 300 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ ఆటగాడు కూడా ఒకే జట్టు తరపున 300 సిక్సర్లు కొట్టలేదు. ఆర్సీబీ తరుఫున 263 సిక్సర్లు బాది ఈ జాబితాలో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్. అయితే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు (357) బాదిన జాబితాలో గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు.
అలాగే.. ఈ మ్యాచ్ ద్వారా ఒకే ఫ్రాంచైజీ (చెన్నై)పై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఫీట్ నెలకొల్పాడు కోహ్లీ. చెన్నై సూపర్ కింగ్స్‌పై రన్ మెషిన్ ఇప్పటి వరకు 1146 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. పంజాబ్ కింగ్స్‌పై వార్నర్ 1134 పరుగులు చేయగా.. తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచులో కోహ్లీ ఈ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.
దీంతో పాటు ఒకే వేదిక (బెంగుళూరులోని చినస్వామి స్టేడియం)లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా కూడా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. చెన్నైతో జరిగిన మ్యాచులో 5 సిక్సర్లు కొట్టడం ద్వారా చిన్నస్వామి స్టేడియంలో (154) అత్యధిక సిక్సులు కొట్టిన క్రిస్ గేల్ (151 సిక్సులు) రికార్డును అధిగమించాడు. అలాగే.. ఒకే సీఎస్కే జట్టుపై అత్యధిక (10) హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.
ఇక.. మ్యాచ్ విషాయానికి వస్తే.. చెన్నైతో జరుగుతోన్న మ్యాచులో ఆర్సీబీ బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (62), జాకబ్ బెతెల్ (55) హాఫ్ సెంచరీలతో మెరుపు ఆరంభం అందించగా.. చివర్లో షెఫార్డ్ (53) రికార్డ్ హాఫ్ అర్థ శతకం బాదాడు. సొంతగడ్డపై ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది.