
హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల అప్లికేషన్లు రాగా, వీటిని మూడు దశల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుండగా, ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో మొదటి దశ దాటలేదు. డూప్లికేషన్ సమస్యే ఇందుకు ప్రధాన కారణమని ఆఫీసర్లు చెప్తున్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాంగ్రెస్అధికారంలోకి రాగానే కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని ప్రకటించడంతో మీ సేవా, గ్రామసభలు, మండల కార్యాలయాలు, ఎండీవో కార్యాలయాల ద్వారా లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు.
Also Read:-గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
చాలామంది ఒకటికి మించి అప్లికేషన్లు పెట్టుకోవడంతో డూప్లికేషన్సమస్య తలెత్తింది. ఈ మల్టీపుల్అప్లికేషన్ల వల్ల ఎంక్వైరీ ప్రక్రియ లేటవుతోంది. వెరిఫికేషన్ పూర్తయిన అప్లికేషన్లు గిర్దావర్, తహసీల్దార్, ఏసీఎస్‌ఓ, డీసీఎస్‌ఓ లాగిన్‌ల ద్వారా ఆమోదం పొంది.. హైదరాబాద్‌లోని సివిల్ సప్లయ్స్ హెడ్ ఆఫీస్‌కు చేరుతున్నాయి. అక్కడ ఆమోదం పొందిన అప్లికేషన్లను ప్రతి నెలా 25వ తేదీలోగా డైనమిక్ కీ రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత నెల నుంచి లబ్ధిదారులకు రేషన్ అందేలా చర్యలు చేపడుతున్నారు.