గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

 ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతుంది. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది. 

తాజాగా  కుత్బుల్లాపూర్ లోని  గాజులరామారం మండలరెవెన్యూ పరిదిలోని సర్వే నెంబర్ 79/1 లో వెలిసిన అక్రమ ఇళ్లను కూల్చివేశారు  రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సర్వే నెంబర్ సూచికబోర్జ్స్ ను అధికారుల ముందే తొలగించారు  కబ్జాదారులు. దీంతో  హెచ్ఎఎల్ కాలనీలో కబ్జాదారులకు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో  పోలీసులు  భారీగా మోహరించారు.

Also Read:-కొత్త రేషన్​ కార్డు కోసం అప్లై చేశారా..? ఇంకా రాలేదా..? కారణం ఇదే..

గ్రేటర్ లో ఓ వైపు హైడ్రా,రెవెన్యూ అధికారులు గత  కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రా ప్రతి సోమవారం అక్రమ నిర్మాణాలపై ప్రజల  నుంచి ఫిర్యాదులు తీసుకుంటోంది హైడ్రా వీటి ఆధారంగా హైడ్రా కూల్చివేతలను పరిశీలించి కూల్చివేస్తోంది.