మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికను ఈ నెల 16న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం రాత్రి మెదక్ మున్సిపాలిటీ ఆఫీస్ లో ఏర్పాట్లను పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
కౌన్సిలర్లతో 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించాలని, మధ్యాహ్నం 12:30కు చైర్‌పర్సన్, అనంతరం వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించాలని సూచించారు. కట్టుదిట్టమైన భద్రత, బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జడ్పీ సీఈవో ఎల్లయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఎస్వో రాజిరెడ్డి, మున్సిపల్ ఆర్ఐ భవాని పాల్గొన్నారు.
