
జూనియర్ అసిస్టెంట్ పోస్టు భర్తీ కోసం భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్), నవీ ముంబయి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 20వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీకాం లేదా బీబీఏ లేదా బీబీఎం(ఫుల్ టైమ్)లో ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 30.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.295. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: మే 20.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు www.bel-india.in లో సంప్రదించగలరు.