యూనియన్ బ్యాంకు ఉద్యోగాలు.. క్వాలిఫికేషన్ బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ.. మంచి ఛాన్సే ఇది..!

యూనియన్ బ్యాంకు ఉద్యోగాలు.. క్వాలిఫికేషన్ బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ.. మంచి ఛాన్సే ఇది..!

వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ లేదా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల పోస్టుల భర్తీ కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా నోటిఫికేషన్  విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 20వ తేదీలోగా ఆన్​లైన్లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య: 500.


పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) 250, అసిస్టెంట్ మేనేజర్(ఐటీ)250.


డిపార్ట్​మెంట్స్: క్రెడిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ


ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బీటెక్ లేదా బీఈ, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్సీ, ఎంఈ లేదా ఎంటెక్, ఎంబీఏ లేదా పీజీడీఎం, ఎంసీఏ, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.


వయోపరిమితి: కనిష్ట  వయోపరిమితి 22 ఏండ్లు, గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 30.


అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 177. ఇతర అభ్యర్థులకు రూ.1180.


లాస్ట్ డేట్: మే 20.


సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ఎగ్జామ్: మొత్తం 225 మార్కులకు ఆన్​లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. పార్ట్–1, పార్ట్–2 గా పరీక్ష ఉంటుంది. పార్ట్–1లో కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (25 మార్కులు), రీజనింగ్(25 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్(25 మార్కులు) ఉంటాయి. పార్ట్–2లో సంబంధిత పోస్టులో ప్రొఫెషనల్​ నాలెడ్జ్ 75 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. 

మొత్తం 150 మార్కులకు పార్ట్–2 పరీక్ష ఉంటుంది. ఎగ్జామ్ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్​ల్లో నిర్వహిస్తారు.  నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. ప్రతి తప్పుడు ప్రశ్నకు 25 శాతం లేదా 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు. ఎలాంటి సమాధానం గుర్తించకుండా వదిలేసిన ప్రశ్నలకు ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ ఉండదు.