సీఎస్ఐఆర్ నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ (సీఎస్ఐఆర్ ఎన్ఎంఎల్) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 02.
పోస్టులు: 22 (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) .ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/ మెట్రిక్యులేషన్ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 05.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మన్, సీఎస్ఐఆర్ ఉద్యోగులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. ఇతరులకు రూ.500.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 02.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.nml.res.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
కంప్యూటర్ బేస్డ్లో నిర్వహించే పరీక్షలో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. 120 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రంలో నాలుగు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో జనరల్ ఇంటెలిజెన్స్ (25 ప్రశ్నలు, 75 మార్కులు), రెండో భాగంలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు, 75 మార్కులు), మూడో భాగంలో జనరల్ అవేర్‌నెస్ (50 ప్రశ్నలు, 150 మార్కులు), నాలుగో భాగంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (50 ప్రశ్నలు, 150 మార్కులు) ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
