అంపైర్ మీదున్న కోపంతో అభిషేక్ను తన్నడమేంటి? గిల్ ప్రవర్తనపై నెటిజన్ల అసంతృప్తి.. వీడియో వైరల్

అంపైర్ మీదున్న కోపంతో అభిషేక్ను తన్నడమేంటి? గిల్ ప్రవర్తనపై నెటిజన్ల అసంతృప్తి.. వీడియో వైరల్

ఎప్పడూ సైలెంట్ గా.. బాల్ పైన మాత్రమే వైలెన్స్ చూపించే శుబ్మన్ గిల్.. శుక్రవారం (మే 2) హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అసహనం కోల్పోవడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకానొక సందర్భంలో అసంతృప్తికి గురి చేసిందనే చెప్పాలి. వరుసగా హాఫ్ సెంచరీలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్.. సన్ రైజర్స్ మ్యాచ్ లో సహనం కోల్పోయి చేసిన హడావిడి చర్చనీయాంశం అయ్యింది.  

తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్.. 38 బాల్స్ లో 76 రన్స్ చేశాడు. అదే సమయంలో అభిషేక్ 41 బాల్స్ లో 74 రన్స్ చేసి SRH టీమ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇద్దరూ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే కావడంతో వీరిమధ్య కాస్త సాన్నిహిత్యం ఎక్కువే ఉంటుంది. కానీ.. గిల్ ప్రవర్తించిన తీరు మాత్రం విమర్శలకు దారి తీరిసింనే చెప్పాలి. 

సెకండ్ ఇన్నింగ్స్ లో అభిషేక్ ఫిజియోథెరపీ చేయించుకుంటుండగా గిల్ కాలితో తన్నడం వివాదాస్పదం అయ్యింది. ఈ ఇన్సిడెంట్ 14వ ఓవర్లో జరిగింది. ప్రసిధ్ కృష్ణ వేసిన బాల్ కనెక్ట్ కాకపోవడంతో అభిషేక్ శర్మ ప్యాడ్లకు తగలడంతో ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో గుజరాత్ కెప్టెన్ రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో ఆన్ ఫీల్డ్ అంపైర్లు నాటౌట్ గా ప్రకటించారు. దీంతో అంపైర్ పై గిల్ తీవ్ర వాగ్వాదానికిదిగాడు.  అభిషేక్ శర్మ కలగజేసుకుని సముదాయించడంతో కూల్ అయి వెళ్లిపోయాడు. 

బాల్ ప్యాడ్స్ కు తగలటంతో అభిషేక్ ఫిజియో చేయించుకునేందుకు గ్రౌండ్ లో అలా కూర్చుండిపోతాడు. ఫిజియో చేస్తుండగా గిల్ వచ్చి.. ‘‘టైమ్ వేస్ట్ ఎందుకు చేస్తున్నావ్ రా..’’ అన్నట్లుగా తన్ని వెళ్తాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో వాదించి.. చివరికి తన అసహనాన్ని అభిషేక్ పై చూపించడమేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అందకు ముందు తను ఔటైన విధానంపై కూడా   గిల్ అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఔట్ ఫీల్డ్ లో ఉన్న అంపైర్ తో తన ఔట్ పై వివాదానికి దిగాడు గిల్. ఒకే మ్యాచ్ లో ఇలా పదే పదే టెంపర్ కోల్పవడంపై  నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ప్రవర్తన సరైంది కాదని.. గిల్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.