బాసెల్: ఇండియా స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ స్విస్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21–15, 12–21, 4–21తో జాసన్ గున్‌వాన్ (హాంకాంగ్) చేతిలో ఓడాడు. 52 నిమిషాల మ్యాచ్‌లో తొలి గేమ్ నెగ్గిన ఇండియన్ ప్లేయర్ తర్వాత రెండు గేమ్‌ల్లో చేతులెత్తేశాడు. మూడో గేమ్‌లో ప్రత్యర్థికి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాడు.
కొకి వాట్నాబే (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో హెచ్.ఎస్. ప్రణయ్ వాకోవర్ ఇచ్చాడు. మరో మ్యాచ్‌లో కిరణ్ జార్జ్ 23–21, 21–19తో లోహ్ కిన్ యీ (సింగపూర్)పై నెగ్గాడు. ఆయుష్ షెట్టి 18–21, 19–21తో బ్రియాన్ యాంగ్(కెనడా) చేతిలో పరాజయం చవిచూశాడు. విమెన్స్ సింగిల్స్‌లో ఉన్నతి హుడా 14–21, 14–21తో చియు పిన్ చియాన్ (చైనీస్‌తైపీ) చేతిలో, తన్వీ శర్మ 11–21, 10–21తో పుత్రి కుసుమ వార్డాని (ఇండోనేసియా) చేతిలో ఓడారు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో 21–15, 21–14తో జాస్పెర్ టోఫ్ట్–అమెలియా మెగ్‌లాండ్ (డెన్మార్క్)పై గెలవగా, రోహన్ కపూర్–రుత్వికా శివాని 19–21, 14–21తో రుత్నాపక్–జెనిచా (థాయ్‌లాండ్) చేతిలో కంగుతిన్నారు.
