రూ.1,000 పెరిగిన బంగారం ధర.. వెండి ధర రూ.1,600 జంప్​

 రూ.1,000 పెరిగిన బంగారం ధర.. వెండి ధర రూ.1,600 జంప్​

న్యూఢిల్లీ: నగల వ్యాపారుల నుంచి భారీ కొనుగోళ్ల కారణంగా శుక్రవారం దేశ రాజధానిలో బంగారం ధర రూ.1,080 పెరిగి రూ.96,800కు చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. గురువారం, 99.9 శాతం ప్యూరిటీ గల పుత్తడి10 గ్రాముల ధర రూ.2,830 తగ్గి రూ.95,720కి చేరుకుంది. 99.5 శాతం ప్యూరిటీ గల బంగారం రేటు రూ.180 పెరిగి రూ.96,350కి చేరుకుంది. 

గత మార్కెట్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దీని విలువ రూ.1,930 తగ్గి రూ.96,170కి చేరుకుంది. వెండి ధరలు కూడా శుక్రవారం కిలోకు రూ.1,600 పెరిగి రూ.97,100కి చేరుకున్నాయి. మునుపటి ముగింపులో దీని ధర రూ.2,500 తగ్గి రూ.95,500కి చేరుకుంది. గ్లోబల్​ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ 23.10 డాలర్లు పెరిగి ఔన్సుకు (28.3 గ్రాములు) 3,262.30 డాలర్లకు చేరుకుంది.