చిన్న చిన్న పట్టణాలకు ఎయిర్పోర్టులు తెస్తాం.. రామ్మోహన్ నాయుడు

చిన్న చిన్న పట్టణాలకు ఎయిర్పోర్టులు తెస్తాం.. రామ్మోహన్ నాయుడు

ఎన్డీయే కూటమి తరఫున పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రిగా ఎంపికైన టీడీపఎంపీ రామ్మోహన్ నాయుడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రామ్మోహన్ నాయుడు. చిన్న చిన్న పట్టణాలకు కూడా ఎయిర్పోర్టులు తెస్తామని అన్నారు. టైర్ 2, టైర్ 3 పట్టణాలకు కూడా విమాన సేవలు అందిస్తామని అన్నారు.భవిష్యత్తు లో 100 శాతం పర్యావరణ హితంగా మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.ఎయిర్ పోర్టుల నిర్మాణం వేగంవంతం చేస్తామని అన్నారు.సామాన్యులకు విమానయాన రంగాన్ని మరింత చేరువ చేస్తామని అన్నారు రామ్మోహన్ నాయుడు. 

భోగాపురం ఎయిర్ పోర్టును రికార్డు సమయంలో పూర్తి చేసి విమానాలు ల్యాండ్ చేస్తామని, విజయవాడ, తిరుపతి కి కనెక్టివిటీ పెంచుతామని అన్నారు.రాజమండ్రీ, కడప, కర్నూలు విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తామని,ఏవియేషన్ రంగం లో స్కిల్ డెవలప్మెంట్ ను ఏపీ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు.ఏపీ, తెలంగాణ సహా రాష్ట్రాల వారిగా విమానాశ్రయాల అభివృద్ధిని వేగవంతం చేస్తామని,విజయవాడ టెర్మినల్ నిర్మాణం పూర్తి చేస్తామని, విజయవాడ ఎయిర్ పోర్టు కనెక్టివిటీ పెంచుతామని అన్నారు.

ఎయిర్పోర్టుల విషయంలో తెలంగాణ నుండి ప్రతిపాదనలు ఉన్నాయని, ఈజ్ అఫ్ ఫ్లయింగ్ పై ఫోకస్ పెడతామని అన్నారు.ప్రధాని మోడీ విజన్ ఉన్న నాయకుడని, మోడీ నాయకత్వంలో దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది అన్నారు. మోడీ యువతకు పెద్ద పీఠ వేస్తారని అన్నారు. తనకు అతిముక్యమైన శాఖ దక్కటం గర్వంగా ఉందని అన్నారు. శ్రీకాకుళం ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. విమానయాన రంగం 2047వరకు ప్రణాళిక ఉందని అన్నారు.