సూర్యాపేట క్రైమ్, వెలుగు:- గత పదేండ్లుగా కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని సీనియర్ సివిల్ జడ్జి నక్కా శ్యామ సుందర్ కోరారు. హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శనివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
న్యాయపీఠం, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మధ్య సమన్వయం ఉన్నప్పుడే కోర్టు కార్యకలాపాలు సజావుగా సాగుతాయన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మారుతీ ప్రసాద్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారపరాజు శ్రీనివాసరావు, కార్యదర్శి ఆర్.వి. రమణారెడ్డి, ఉపాధ్యక్షుడు జక్కుల వీరయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

