తెలంగాణలో ఉపా చట్టాన్ని రద్దు చేయాలి : గడ్డం లక్ష్మణ్

తెలంగాణలో ఉపా చట్టాన్ని  రద్దు చేయాలి : గడ్డం లక్ష్మణ్
  • పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణలో ఉపా చట్టాన్ని రద్దు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యపై ఉపా చట్టాన్ని నమోదు చేసి, అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు సోమవారం హైదర్ గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ రావుతో కలిసి గడ్డం లక్ష్మణ్ పాల్గొన్నారు.