ఓయూలో సివిల్ సర్వీసెస్ అకాడమీ ప్రారంభించిన సీఎస్ సోమేశ్​

ఓయూలో సివిల్ సర్వీసెస్ అకాడమీ ప్రారంభించిన సీఎస్ సోమేశ్​

ఓయూ, వెలుగు: ఉస్మానియా వర్సిటీ స్టూడెంట్లు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్​లుగా ఎదగాలని సీఎస్​ సోమేశ్ కుమార్ ఆకాంక్షించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేలా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న తన ప్రతిపాదనను అమలు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఓయూలో ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్ అకాడమీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 

24 గంటల పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షల్లో మెళకువలు నేర్పేందుకు తాను సిద్ధంగా ఉన్నా అని, ఎప్పుడు పిలిస్తే అప్పుడొచ్చి క్లాసులు తీసుకుంటానని సీఎస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజియేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, వీసీ ప్రొ.రవీందర్ యాదవ్, ఉన్నత విద్యామండలి చైర్మన్​ ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.