మిల్లింగ్‌‌ యంత్రాలను అప్‌‌ గ్రేడ్‌‌ చేస్కోవాలి : స్టీఫెన్‌‌ రవీంద్ర

మిల్లింగ్‌‌ యంత్రాలను అప్‌‌ గ్రేడ్‌‌ చేస్కోవాలి : స్టీఫెన్‌‌ రవీంద్ర
  •     మిల్లర్లకు స్టీఫెన్‌‌ రవీంద్ర ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కేంద్ర నిబంధనలకు అనుగుణంగా మిల్లింగ్‌‌ యంత్రాలను అప్​గ్రేడ్​ చేసుకోవాలని సివిల్‌‌ సప్లయ్స్‌‌ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రంలోని రైస్​ మిల్లర్లతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. తాజా నిబంధనల మేరకు 2026-–27 నుంచి దేశవ్యాప్తంగా పీడీఎస్​ కింద సరఫరా చేసే కస్టమ్ మిల్డ్ రైస్‌‌లో ముడి బియ్యంలో గరిష్టంగా 10 శాతం, బాయిల్డ్ బియ్యంలో 5 శాతం నూకలకు అనుమతిస్తుందని  స్టీఫెన్‌‌ రవీంద్ర తెలిపారు. 

పిల్లల ఆరోగ్యం, పోషకాహారానికి ప్రాధాన్యతనిస్తూ వెల్ఫేర్ స్కీంల కింద మిడ్-డే మీల్ పథకం, ప్రభుత్వ హాస్టళ్లకు ప్రత్యేకంగా స్టీమ్డ్ రైస్  సరఫరా చేయనున్నట్లు కమిషనర్ ప్రకటించారు.సమావేశంలో  నాగేందర్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.