అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..రేషన్ డీలర్లకు సివిల్ సప్లయ్ కమిషనర్ వార్నింగ్

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..రేషన్ డీలర్లకు సివిల్ సప్లయ్ కమిషనర్ వార్నింగ్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: రేషన్​ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ కమిషనర్​ స్టీఫెన్​రవీంద్ర హెచ్చరించారు. శుక్రవారం సికింద్రాబాద్  పికెట్ ప్రాంతంలోని రేషన్​ దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పలువురు రేషన్ కార్డుదారులతో మాట్లాడారు. రేషన్​ షాపుల ద్వారా పంపిణీ అవుతున్న బియ్యం సహా ఇతర సరుకులు నిర్దేశిత పరిమాణంలో, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా అందుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. డీలర్ ప్రవర్తనపై కూడా ఫీడ్‌‌బ్యాక్ తీసుకున్నారు.