ప్రతి గింజనూ మద్దతు ధరకు కొంటాం: సివిల్‌‌‌‌ సప్లై కమిషనర్‌‌‌‌ డీఎస్‌‌‌‌ చౌహాన్‌‌‌‌

ప్రతి గింజనూ మద్దతు ధరకు కొంటాం: సివిల్‌‌‌‌ సప్లై కమిషనర్‌‌‌‌ డీఎస్‌‌‌‌ చౌహాన్‌‌‌‌
  • సివిల్‌‌‌‌ సప్లై కమిషనర్‌‌‌‌ డీఎస్‌‌‌‌ చౌహాన్‌‌‌‌

గంగాధర, వెలుగు : అకాల వర్షాలతో తడిసిన, రంగు మారిన వడ్లను మద్దతు ధరకు కొంటామని సివిల్‌‌‌‌ సప్లై కమిషనర్‌‌‌‌ దేవేంద్ర సింగ్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ చెప్పారు. కరీంనగర్‌‌‌‌ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మార్కెట్‌‌‌‌ యార్డులో పీఏసీఎస్, మధురానగర్‌‌‌‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన సందర్శించి తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల వడ్లు కొన్నారు.. ఇంకా ఎన్ని క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మద్దతు ధర ఇస్తున్నారా ? లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు భరోసా ఇచ్చేందుకే జిల్లాల్లో పర్యటిస్తున్నామన్నారు. రైతులకు నష్టం లేకుండా ప్రతి గింజనూ కొంటామని స్పష్టం చేశారు. తరుగు పేరిట ధాన్యంలో కోత విధించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఒక గ్రాము వడ్లు కూడా కోత పెట్టే అధికారం మిల్లర్లకు లేదని స్పష్టం చేశారు. ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి రైతులు ఇబ్బందులు పడకుండా చూస్తామన్నారు. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున వారం రోజుల పాటు ఆఫీసర్లు అలర్ట్‌‌‌‌గా ఉండాలని, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తేమ శాతం కరెక్ట్‌‌‌‌గా ఉన్న వడ్లను ఎప్పటికప్పుడు తూకం వేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌కు ఉపయోగించుకోవచ్చని, దీని వల్ల మిల్లర్లకు సైతం ఎలాంటి నష్టం కలగదన్నారు. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చే ప్రతి రైతుకు సంబంధించిన డేటా, సెల్‌‌‌‌ నంబర్‌‌‌‌ను రిజిస్టర్‌‌‌‌లో నమోదు చేయాలని, ఏమైనా ఇబ్బందులుంటే డైరెక్టర్‌‌‌‌గా మాట్లాడొచ్చని సూచించారు. ఆయన వెంట అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ లక్ష్మీకిరణ్, సివిల్ సప్లై డీఎం రజినీకాంత్, ఇన్‌‌‌‌చార్జి డీఎస్‌‌‌‌వో సురేశ్‌‌‌‌రెడ్డి, మార్కెటింగ్ ఆఫీసర్‌‌‌‌ పద్మావతి, డీసీవో రామానుజాచార్య ఉన్నారు.