తెలంగాణలో లాక్ డౌన్ పై ఆరోగ్యశాఖ క్లారిటీ

తెలంగాణలో లాక్ డౌన్ పై ఆరోగ్యశాఖ క్లారిటీ

ఒమిక్రాన్, థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ఆరోగ్యశాఖ పూర్తి సంసిద్ధంగా ఉందన్నారు హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రంలో  నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఉండబోవని ఇదివరకే చెప్పామని.. మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చారు. జనవరి చివరలో లాక్‌డౌన్ ఉండొచ్చునని తాను  చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

మరిన్ని వార్తల కోసం...

ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 6.5 శాతం