
ట్యాంక్ బండ్, వెలుగు: జీవో నంబర్ 190లో స్థానికతపై ప్రభుత్వం స్పందించాలని 317 ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ టి.విజయ్ కుమార్, సెక్రటరీ జనరల్ నాగేశ్వరరావు కోరారు. మంగళవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జీవో 317 జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న తలపెట్టిన చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ డిప్యూటేషన్ జీవో 190లో కూడా స్థానికత లేదనే విషయంపై ప్రభుత్వం స్పందించాలన్నారు. ఈ జీవో ద్వారా తాత్కాలిక డిప్యూటేషన్ లో కేవలం కొంతమందికి మాత్రమే అవకాశాన్ని కల్పించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు ఐలయ్య, పృథ్వీ, జ్యోతి, సాయి తదితరులు పాల్గొన్నారు.