లూడోలో బెట్టింగ్.. ఫ్రెండ్స్ మధ్య కొట్లాటలో ఒకరి మృతి

V6 Velugu Posted on Sep 05, 2021

హైదరాబాద్ లో లూడో గేమ్ ప్రాణాలు తీసింది. మంగల్ హాట్ లోని ఏడుగురు ఫ్రెండ్స్ కలిసి బెట్టింగ్ వేసుకుని లూడో ఆడారు. గొడవ జరగడంతో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. దీంతో ఒకరు చనిపోగా... మరో ఇద్దరు చావు బతుకుల్లో ఉన్నారు. గంగాబౌలికి చెందిన మహమ్మద్ అనీఫ్, టపచపుత్రకు చెందిన రషీద్, మంగల్ హాట్ కు చెందిన మహమ్మద్ ముస్తఫాతో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో నలుగురు లూడో గేమ్ ఆడారు. గెలుపోటములపై ఫ్రెండ్స్ మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉండటంతో ఒకరినొకరు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా కత్తులతో పొడుచుకున్నారు. దాడిలో మహమ్మద్ అనీఫ్ స్పాట్ లోనే చనిపోయాడు. మహమ్మద్ ముస్తఫ్, రషీద్ లకు తీవ్రగాయాలవడంతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. నిందితుల కోసం స్పెషల్ టీం గాలిస్తోందన్నారు పోలీసులు.

Tagged Hyderabad, friends, betting, clash, ludo game

Latest Videos

Subscribe Now

More News