కోమటిరెడ్డి vs హరీష్ రావు .. అసెంబ్లీలో మాటల యుద్ధం

కోమటిరెడ్డి vs హరీష్ రావు .. అసెంబ్లీలో మాటల యుద్ధం

కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం సంతోషకరమని, స్వాగతిస్తున్నామని  మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.  ఇది బీఆర్ఎస్, ప్రజల విజయమని చెప్పారు. రేపు నల్గొండలో బీఆర్ఎస్ సభ పెట్టినందునే ప్రభుత్వం ఈ తీర్మానం చేసిందని  చెప్పారు హరీష్  రావు.   

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్దం నడించింది.  నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ నాశానం చేసిందని, చెప్పుతో కొట్టినట్టు ఆ పార్టీకి  జిల్లాలో డిపాజిట్లు కూడా రాలేదన్నారు. నల్గొండలో అడుగుపెట్టే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు.  

దీనిపై హరీష్ రావు మాట్లాడుతూ అదే మాట అమేథీలో రాహుల్ గాంధీకి కూడా వర్తిస్తుందని చెప్పారు.  దీంతో సభలో గందరగోళం నెలకొంది.  కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలిగించాలని స్పీకర్ ను కోరారు హరీష్ రావు.