మేయర్, మాజీ మేయర్ వర్గాల మధ్య గొడవ

మేయర్, మాజీ మేయర్ వర్గాల మధ్య గొడవ

గండిపేట్,వెలుగు: బండ్లగూడ జాగీరు మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన  ప్రస్తుత మేయర్‌‌, మాజీ మేయర్‌‌ వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. వివరాల్లోకి వెళితే.. బండ్లగూడలో ఆదివారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్పొరేషన్‌‌ అధికారులు  ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. 

రాజేంద్రనగర్‌‌ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌‌గౌడ్‌‌ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా.. బీఆర్ఎస్ నేత, మాజీ మేయర్‌‌ మహేందర్‌‌గౌడ్‌‌ వర్గం, కాంగ్రెస్ నేత, ప్రస్తుత మేయర్‌‌ లతాప్రేమ్‌‌గౌడ్‌‌ వర్గాన్ని లోపలికి రానివ్వకుండా దారికి అడ్డుగా ఉండగా.. ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు.  దీంతో 1వ వార్డు కార్పొరేటర్‌‌ చంద్రశేఖర్, 5వ వార్డు కార్పొరేటర్‌‌ శ్రీనాథ్‌‌రెడ్డిపై బీఆర్ ఎస్ నేతలు గొడవకు దిగి  వారి చొక్కాలు చించివేశారు. కార్పొరేటర్‌‌ చంద్రశేఖర్‌‌ను కులం పేరుతో దూషిసూ దాడికి దిగారు. ఎమ్మెల్యే ప్రకాష్‌‌గౌడ్‌‌ సమక్షంలోనే దాడులకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. బాధితులు పరస్పరం రాజేంద్రనగర్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌లో ఫిర్యాదులు చేశారు.