లాయర్లను పరిగెత్తించి లాఠీలతో కొట్టిన పోలీసులు

లాయర్లను పరిగెత్తించి లాఠీలతో కొట్టిన పోలీసులు

ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ లో లాయర్లపై పోలీసులు లాఠీచార్జ్ ఉద్రిక్తతకు దారితీసింది.  మహిళా న్యాయవాది, ఆమె తండ్రిపై అక్రమ కేసులు బనాయించారని.. తక్షణమే కేసులు వెనక్కి తీసుకోవాలని  లాయర్లు ధర్నాకు దిగారు.  లాయర్లకు మధ్య వాగ్వాదం ముదిరి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో అక్కడి పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో పోలీసులు, లాయర్లకు గాయాలయ్యాయి. 

మంగళవారం హాపూర్ తహసీల్ చౌరస్తాలో  లాయర్లు నిరసన చేపట్టడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద ఎత్తున్న వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. న్యాయవాదులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం పెరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. 

 అయితే లాయర్లు అటు ప్రజలు, పోలీసులపై దాడి చేసినట్లు ఆరోపించారు పోలీసులు. ఉద్రిక్తత హింసాత్మక ఘర్షణకు దారితీయడంతో లాఠీ ఛార్జ్ చేయడంతో పోలీసులు, న్యాయవాదులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు, ముగ్గురు న్యాయవాదులు గాయపడ్డారు. చికిత్స కోసం హత్రాస్ తరలించారు.