ఫిబ్రవరి 23 నుంచి క్లీన్మాక్స్ ఐపీఓ

ఫిబ్రవరి 23 నుంచి క్లీన్మాక్స్ ఐపీఓ

న్యూఢిల్లీ: క్లీన్‌‌‌‌‌‌‌‌మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ రూ.3,100 కోట్లు సేకరించడానికి ఐపీఓకు వస్తోంది. ఈనెల 23 నుంచి 25 వరకు ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో షేరు ధరను రూ.1,000 నుంచి రూ.1,053 మధ్య నిర్ణయింయింది. తాజా షేర్ల జారీ ద్వారా రూ.1,200 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్​) కింద రూ.1,900 కోట్లు సమీకరిస్తున్నారు.

ఈ నిధులను అప్పుల చెల్లింపు, కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది. వచ్చే నెల రెండో తేదీన స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో కంపెనీ షేర్లు లిస్ట్ అవుతాయి. గూగుల్, అమెజాన్ వంటి బడా కంపెనీలకు  క్లీన్‌‌‌‌‌‌‌‌మాక్స్ ఎన్విరో పునరుత్పాదక ఇంధనాన్ని అందిస్తోంది.