V6 News

తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలు..2వేల డ్రోన్లతో రికార్డు లక్ష్యంగా డ్రోన్ షో

తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలు..2వేల డ్రోన్లతో రికార్డు లక్ష్యంగా డ్రోన్ షో

తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు వేడుకలు అట్టహాసం ముగిశాయి. ఈ సందర్భంగా భారీ డ్రోన్ షో నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డ్రోన్ షో కలర్ ఫుల్ గా సాగింది. ప్రజాప్రభుత్వ విజయాలను తెలిపేలా డ్రోన్ షో  లో ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.

ముగింపు కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. 83 పేజీలతో రూపకల్పన చేసిన విజన్‌ డాక్యుమెంట్‌లో యువత, మహిళలు, రైతులకు ప్రాధాన్యతతో 10 కీలక వ్యూహాలను పొందుపర్చారు. సమతుల్య అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ విధానాన్ని  ఈ డాక్యుమెంట్ లో పొందుపర్చారు. 

పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత, విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్ట్‌లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఫ్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రై పోర్ట్‌, గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, RRR, రింగురైలు, బుల్లెట్ రైలు, ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ, ప్రత్యేక నిధి ఏర్పాటు  తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాతావరణ మార్పుల వల్ల నష్టాలను తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతపై దృష్టి సారించింది. సాంస్కృతిక వారసత్వం, కళలు, పర్యాటకం పరిరక్షణకు పాలనలో పౌరుల భాగస్వామ్యం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాల రూపకల్పన చేశారు.