నాల్గో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ

నాల్గో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నాల్గో విడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారంతో ముగియనుంది. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ సమీపంలోని ఎల్పీటీ పార్కింగ్ గ్రౌండ్ లో సాయంత్రం నాలుగు గంటలకు ముగింపు సభ ప్రారంభం కానుంది. 

నేడు సంజయ్ పాదయాత్ర

ముగింపు సభ

ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి హాజరుకానున్నారు. సభా ఏర్పాట్లను  బుధవారం పార్టీ నేతలు మనోహర్ రెడ్డి,  జితేందర్ రెడ్డి,  గరికపాటి మోహన్ రావు, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ రెడ్డి పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ పాదయాత్రను ఆపేందుకు టీఆర్ఎస్ అనేక కుట్రలు చేసిందని, కానీ ప్రజల ఆశీర్వాదంతో విజయవంతంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడుతున్నారని మండిపడ్డారు. పాదయాత్రతో ప్రభుత్వ వైఫల్యాలు బయట పడుతున్నాయనే ఆందోళనలో కేసీఆర్ ఉన్నారని అన్నారు. పాదయాత్రలో ప్రజలు చెప్తున్న సమస్యలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని, అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల కష్టాలు అన్ని తీరుతాయని అన్నారు.