
ఈనెల 26న సూర్యగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని అర్చకులు మూసివేయనున్నారు. రేపు(బుధవారం) రాత్రి 10 గంటలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలు మూసివేయనున్నారు. తిరిగి 26 సాయంత్రం అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించిన తర్వాత దుర్గమ్మ ఆలయం తెరుచుకోనుంది.