ప్రజాహితమే లక్ష్యంగా సేవ చేస్తున్నాం : చెన్నాడి సుధాకర్ రావు

ప్రజాహితమే లక్ష్యంగా సేవ చేస్తున్నాం : చెన్నాడి సుధాకర్ రావు

హైదరాబాద్ , వెలుగు: తెలంగాణలో ప్రజాహితం కోసం హైదరాబాద్ బోట్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్టు మాజీ ఎమ్మెల్సీ, క్లబ్ అధ్యక్షుడు చెన్నాడి సుధాకర్ రావు పేర్కొన్నారు.  ఆదివారం క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కొత్త కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. క్లబ్ సభ్యుల కోసం హెల్త్ క్యాంపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

 2024 –- 26  సంవత్సరానికి ఎన్నికైన కొత్త కమిటీని ప్రకటించారు. 8వసారి ప్రెసిడెంట్ గా చెన్నాడి సుధాకర్ రావు, వైస్ ప్రెసిడెంట్ మురళీధర్ రెడ్డి, సెక్రటరీ టి. అమరేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ బి. నరేందర్ రావు, కోశాధికారి కె. ధరణిధర్, బోట్ క్లబ్ మీటింగ్ కమిటీ మెంబర్స్  హెచ్ వీ సురేందర్ నాథ్, సోమ విజయ్ ప్రకాష్, శేషగిరిరావు తుమ్మల, టి శ్రీధర్ రెడ్డి, వి సుధీర్ రెడ్డి, వి. విజయ్ గోపాల్ రావు ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు.