పర్యవేక్షక కమిటీతో క్లబ్ సెక్రటరీల మీటింగ్ వాయిదా

పర్యవేక్షక కమిటీతో క్లబ్ సెక్రటరీల మీటింగ్ వాయిదా

ఉప్పల్ స్టేడియంలో సుప్రీంకోర్టు పర్యవేక్షక కమిటీతో జరగాల్సిన క్లబ్ సెక్రటరీల సమావేశం వాయిదా పడింది. పర్యవేక్షక కమిటీని కలిసేందుకు 140 క్లబ్ సెక్రటరీలు రాగా అనివార్య కారణాలతో పర్యవేక్షక కమిటీ గైర్హాజరైంది. సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షణ కమిటీని కలిసేందుకు వస్తే కమిటీ అందుబాటులో లేదని హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్ తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు వీలైనంత త్వరగా జరపాలని సూచించారు. అంతకంటే ముందు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలని కోరారు.

సెప్టెంబర్ 26 తో అజారుద్దీన్ టర్మ్ ముగిసిందని.. ఇప్పటికే హెచ్సీఏ ఎన్నిక ఆలస్యం అయిందని హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ తెలిపారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. పర్యవేక్షణ కమిటీ అన్ని సమస్యలు పరిష్కరిస్తుందన్న నమ్మకం తమకుందన్నారు. హెచ్సీఏలో గందరగోళం నెలకొందని.. సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీపై తమకు పూర్తి నమ్మకం ఉందని హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు వినోద్ తెలిపారు. జనరల్ బాడీ మీటింగ్ లో అనేక అంశాలు చర్చిస్తామని చెప్పారు. తాను హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్య రాలేదని.. కానీ అజార్ నేతృత్వంలో ఉన్న కమిటీ అనేక కొత్త సమస్యలు తెచ్చిపెట్టిందని ఆరోపించారు.