సీఎం దత్తత గ్రామానికి వారంలో రైతుబంధు

సీఎం దత్తత గ్రామానికి వారంలో రైతుబంధు

మేడ్చల్ కలెక్టర్ ప్రకటన..
లక్ష్మాపూర్ రైతులు ఆందోళన చెందొద్దని సూచన

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ దత్తత గ్రామం లక్ష్మాపూర్ రైతులకు వారం రోజుల్లో రైతుబంధు ఇస్తామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ప్రకటించారు. ‘సీఎం దత్తత గ్రామానికి రైతుబంద్ కట్’ పేరిట వెలుగులో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. రైతు బంధుపై రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని వారం రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. లక్ష్మాపూర్ గ్రామానికి నక్షా లేనందున రీ సర్వేచేయించాల్సిందిగా కొద్దిరోజుల కిందట ఆ గ్రామ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ ను రైతులు కోరారని అన్నారు. దీంతో వెంటనే రీసర్వే చేయించాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. గ్రామంలో రీ సర్వే చేయగా దానిపై 350 అభ్యంతరాలు వచ్చాయని, వాటిని పరిష్కరించి కొత్త రిజిస్టర్ తయారు చేశామని తెలిపారు. సర్వే ఆధారంగా గ్రామంలోని రైతుల వివరాలను వెబ్ల్ ల్యాండ్లో నమోదు చేస్తున్నామని, ఆ పని వారం రోజుల్లో పూర్తవుతుందని అన్నారు. అందుకే రైతుబంధు లేట్ అయిందని, కావాలని ఆపలేదని చెప్పారు. వివరాలు వెబ్ ల్యాండ్లో అప్లోడ్ చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమచేస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన అన్ని చర్యలూ తీసుకున్నామని చెప్పారు.

For More News..

ప్రాణాలు పోతున్నా పట్టించుకుంటలే!

ఆన్ లైన్ క్లాసులపై నో క్లారిటీ.. అయినా ఆపమంటున్న ప్రైవేట్ సంస్థలు

డాడీ.. ఊపిరి ఆడుతలేదు.. ఆక్సిజన్‌‌ తీసేసిన్రు.. ఇక సచ్చిపోతున్న బై..