- నవంబర్ 8, 9వ తేదీల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారంతో నియోజకవర్గంలో రాజకీయ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
ఈ మేరకు సీఎం ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 31నరాత్రి 7 గంటలకు వెంగళ్రావు నగర్లో, రాత్రి 8 గంటలకు సోమాజిగూడలో, నవంబర్ 1న రాత్రి 7 గంటలకు బోరబండలో, 8గంటలకు ఎర్రగడ్డలో, నవంబర్ 4న షేక్‌పేట1లో రాత్రి 7గంటలకు, రహైమాత్నగర్లో రాత్రి 8గంటలకు, నవంబర్ 5న రాత్రి 7గంటలకు షేక్‌పేట–2, రాత్రి 8 గంటలకు యూసఫ్‌గూడలో, నవంబర్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరు డివిజన్లలో నిర్వహించే మోటర్ సైకిల్ ర్యాలీల్లో పాల్గొంటారు. నవంబర్ 9న ఉదయం 10 గంటలకు నిర్వహించే మోటర్ సైకిల్ ర్యాలీ చేపట్టనున్నారు.
