పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. శుక్రవారం ( మే 15 ) జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సహా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. పుట్టపర్తి దేశం గర్వించే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా మారుతోందని అన్నారు. పుట్టపర్తి సత్యసాయి బోధనలతో విశ్వశాంతికి బాటలు వేసిందని.. ఇప్పుడు అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు రావడం ఎంతో కీలకమని అన్నారు.
ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా ఆత్మనిర్బర్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి ఈ ప్రాజెక్టుకు దోహదపడుతుందని అన్నారు చంద్రబాబు. భారత రక్షణ శక్తిని చాటడంలో ఆపరేషన్ సిందూర్ ఓ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో వినియోగించిన డ్రోన్లు ఏపీలోనే తయారు చేసి పరీక్షించారని అన్నారు.
►ALSO READ | ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన...
ఏఎంసీఏ ప్రాజెక్టు ఏపీకి కేటాయించినందుకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 7 వేల 500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని అన్నారు సీఎం చంద్రబాబు.
